ఆపదలో ఆపన్నహస్తం ఏయిర్ ఇండియా

ఇటలీలోని మిలన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో
218 భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. MEA అధికారులు వీళ్లందరిని ఐటీబీపీ స్థావరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలించారు. కరోనా వైరస్ సోకిందా లేదానే వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు అక్కడే వైద్యుల సమక్షంలో పర్యవేక్షణలో ఉంచనున్నారు. అలాగే ఇరాన్‌ నుంచి చేరుకున్న 234 మందిని జైసల్మేర్‌కు తరలించారు.