‘పుష్ప’ కోసం అదిరిపోయే ఐటమ్

‘పుష్ప’ కోసం అదిరిపోయే ఐటమ్

సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అనగానే, ఆ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే సాంగ్ ఒకటి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ జనం నాలుకలపై జాతర చేశాయి. ఇప్పటికీ ఫంక్షన్స్ లో ఈ పాటలు సందడి చేస్తూనే ఉంటాయి. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాల్లో ఐటమ్ సాంగ్ పై కూడా అంచనాలు ఉంటాయి. ఈ కారణంగానే ఇద్దరూ కూడా ఒక ఐటమ్ సాంగ్ కి మించి మరో ఐటమ్ సాంగ్ ఉండేలా కేర్ తీసుకుంటూ ఉంటారు.తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ ఉండనుందనే వార్తలు వచ్చాయి. ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ ను దేవిశ్రీ ప్రసాద్ వినిపించగానే సుకుమార్ ఫుల్ ఖుషీ అయ్యాడట. జానపద బాణీలో సాగే ఈ పాటను రీసెంట్ గా రికార్డు చేశారని అంటున్నారు. ఐటమ్ సాంగులో ఆడిపాడే బ్యూటీగా ఊర్వశీ రౌతేలా .. దిశా పటాని పేర్లు వినిపించాయి. మరి వీరిలో బన్నీతో కలిసి చిందులు వేసే ముద్దుగుమ్మ ఎవరో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.