అన్నదాత-రైతే రాజుకు మినహాయింపు

అన్నదాత-రైతే రాజుకు మినహాయింపు

రైతులంటే మనకు చిన్నచూపు. వ్యవసాయం చేస్తే లాభాలు తక్కువ, శ్రమ ఎక్కువ. అంతేకాదండోయ్ నేటి యువతకు ఒళ్ళు బరువైపోయింది. వైట్ కలర్ ఉద్యోగాలు, వైట్ కాలర్ మోసాలు ఇలాంటివి చెప్పండి చేస్తాము. ఈ దుస్థితికి కారణం సమాజమే కాదండోయ్ పాలకులు కూడా. కారణం పంట పండించేందుకు ఆరుగాలం శ్రమ పడాలి, పంటను అమ్మడానికి అష్టకష్టాలు, గిట్టుబాటు ధరలు శూన్యం, వడ్డీ రాయుళ్ల వేధింపులు, చివరికి ఆత్మహత్యలు. ఇప్పటి వరకు మనదేశంలో పరిస్థితులు. కానీ ఇవాళ కరోనా కారణంగా సమాజంలో ఆహార కొరత ఉండకుండా ఉండేందుకు అత్యవసర సేవల్లో భాగంగా (కూరగాయలు, బియ్యం, పప్పు దినుసులు) ఆంధ్రప్రదేశ్ సర్కారు రైతులు సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల రవాణాలోనూ ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది. రైతన్న కాయకష్టం చేయకపోతే కనీసం నిత్యవసరాలైన కూరగాయలు, పాలు-పెరుగు కూడా సామాన్యులకు అందుబాటులోకి రావడం కష్టమవుతుంది. అందుకే AP సర్కారు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. పొలాల్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులను రవాణా, నిత్యావసర వస్తువుల ఉత్పత్తి తయారీ యూనిట్లు. రబీ పంటల కోతలు, కోతలు పంట నూర్పిడి, ఆరబెట్టడం, రాబోయే సీజన్‌కు విత్తనాలను ప్యాకింగ్‌, చిరుధాన్యాలు, పత్తి, పప్పుధాన్యాలు, వరి, కూరగాయల విత్తనాలను అభివృద్ధి, ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పొలం పనులు చేసుకోవచ్చు.

ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన విత్తన కంపెనీలు అన్ని జాగ్రత్తలతో తమ విత్తనాలను తరలింపు, ఎరువులు, పురుగు మందుల కంపెనీలు నిర్వహణ, లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు పూర్తిగా ఇవ్వాలి. ఈ నియమ నిబంధనలు లాక్‌ డౌన్‌ అత్యవసర పరిస్థితులకు లోబడి ఉండాలి. ఇప్పటికైనాఇప్పటికైనా అర్థమవ్వాలి అత్యవసరాల్లో కూడా రైతు సమజాహితం కోసం పోరాడుతారని, నిత్యావసరాలు రైతు పండించకపోతే మనగతి దుస్థితి దారుణమనే విషయం. ఎప్పటికీ రైతే రాజు. జై కిసాన్- జై జవాన్, జయహో డాక్టర్లు, వైద్యో నారాయణ హరి.