J&Kలో లష్కరే తోయిబా ముఠా అరెస్ట్

జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలో హండ్వారా పోలీసులు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను, అలాగే మరో ముగ్గురిని అదువులోకి తీసుకున్నారు. ఈ తీవ్రవాదుల నుంచి 3 ఏకే-47 రైఫిళ్లు, 12 హాండ్‌ గ్రనేడ్లను స్వాధీనంలోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌ సోపోర్‌ జిల్లాలో CRPF, SOG, 22 రాష్ట్రీయ రైఫిల్స్‌ పోలీసు బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ చేయడంతో లష్కరే తోయిబాకు ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.