అమెరికా, బ్రిటన్ సహా ఇతర దేశాల్లోనూ సీఎం కేసీఆర్ ముందు చూపునకు NRI’s నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి . కరోనా విషయంలో తొలి దశలోనే లాక్ డౌన్ కొనసాగింపు అవసరమని కేంద్రం కంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో విదేశాల్లో ఉన్న తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ NRI’s అప్రమత్తమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించిన సమయానికి NRI’s ఉన్న ఇతర దేశాలు లాక్ డౌన్ గురించి అసలు ఆలోచించలేదు. కేసీఆర్ మీడియా సమావేశాలను క్రమం తప్పకుండా చేస్తోన్న NRI’s కరోనా విషయంలో ముందే అప్రమత్తమై నెలా,రెండు నెలలకు అవసరమైన నిత్యావసర సరుకులను కొనుక్కుని స్వచ్చంద నిర్బంధాన్ని పాటిస్తున్నారు. అమెరికా, లండన్ సహా ఇతర దేశాల్లో ఉన్న మన వాళ్ళు ముందుగా జాగ్రత్త పడడంతో కరోనా నుండి బయటపడడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ ఉన్న NRI’s కుటుంబ సభ్యులు కూడా CM KCR ప్రెస్ మీట్ చూసిన తర్వాత తమ బిడ్డల్ని అప్రమత్తం చేశారు . KCR ముందు చూపు ఇతర రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాకుండా విదేశాల్లోని NRI’s మేల్కొలిపింది. NRI’s ఫోన్ లో ఎవరు మాట్లాడుకున్నా CM KCR నిర్ణయాలే చర్చకు వస్తున్నాయని మన తెలంగాణ బిడ్డలు తెలిపారు.