జయ లలిత బయోపిక్ సినిమాలో కంగనా రనౌత్

జయ లలిత బయోపిక్ సినిమాలో కంగనా రనౌత్

క్వీన్ కంగనా రనౌత్ పురుచ్చతలైవీ జయలలిత జీవిత నేపథ్యంలో రూపొందుతున్న బయోపిక్ చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కంగనా తలైవి జయలలితగా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఫోటోలు ఒక్కొక్కటీ విడుదలవుతుండగా కొత్త లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్నాయి. కంగనా సోదరి రంగోలి చందేల్ తన ట్విట్టర్లో తలైవీ సెట్లో ఉన్న కంగనా ఫొటోలను షేర్ చేయగా.. ఇవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే సన్నజాజి తీగలా ఉండే కంగనా ఒక్కసారిగా ముద్ద బంతిలా మారి లావుగా కనిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే పురుచ్చతలైవీ చిత్రం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరుగు ఈ పాత్ర కోసం ఆమె చాలా శ్రద్ద తీసుకుందని సమాచారం. దాకడ్- తేజన్ చిత్రాల్లో నటించే ముందు ఈ బ్యూటీ బరువు పెరగాలని నిర్ణయం తీసుకోవడం సాహసమేనని నెటిజనులు విమర్శిస్తున్నారు. ఆ రెండు చిత్రాల షూటింగ్ లలో కంగన మరో రెండు నెలల్లో పాల్గొనబోతోందని కంగనా సోదరి రంగోలి వెల్లడించింది. కంగనా రనౌత్ తలైవి చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.