బన్సాలీతో జూనియర్ ఎన్టీఆర్???

బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ టాలీవుడ్ సెన్సేషన్ జూనియర్ తో జట్టు కట్టబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ లో ఉన్న ఎన్టీఆర్ తన 30వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ అయ్యారు. త్రిబుల్ ఆర్ షూటింగ్ అనంతరం పట్టాలెక్కి వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల చిత్రం. ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలే హస్తిన’కు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే ఎన్టీఆర్ హీరోగా చేయబోయే 31వ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తొకటి హల్ చల్ చేస్తుంది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కానే లేదు అప్పడే తారక్ 31వ సినిమానా అంటూ వస్తున్న వార్తలపై సందేహం రాకమానదు. ఎన్టీఆర్ 31 వ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ఈ వార్త సారాంశం. బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో ఓ భారీ పీరియాడికల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నారని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ వార్తలకే పరిమితం అవుతుందో నిజమై అభిమానులను ఆనందిపజేస్తుందో చూడాలి.