బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతి రాదిత్యా సింధియా బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సింధియా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత జేపీ నడ్డాతో చర్చలు జరిపి, అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సింధియాకు కండువా కప్పి జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ లో పనిచేసిన సింధియా ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

Jyotiraditya Scindia, Harsh Chauhan declared BJP’s Rajya Sabha candidates from Madhya Pradesh.