జాక్‌పాట్ కొట్టేయ‌నున్న‌ కాజ‌ల్‌..!

జాక్‌పాట్ కొట్టేయ‌నున్న‌ కాజ‌ల్‌..!
మెగాస్టార్ సినిమాలో అవ‌కాశం
త‌ప్పుకున్న త్రిష‌.. ప‌రిశీల‌న‌లో కాజ‌ల్‌

– ఒక్కోసారి ఊహించని జాక్ పాట్ తగులుతూ ఉంటుంది. అయితే దానికి గంపెడు అదృష్టం ఉండాలి. ఉదాహరణకు ‘కబీర్ సింగ్’ లో హీరోయిన్ గా ఫస్ట్ కియారాను ఎంపిక చెయ్యలేదు. వేరే హీరోయిన్ తో షూటింగ్ కూడా చేశారు. అయితే ఎఫెక్టివ్ గా లేక పోవడం తో ఆ భామను పక్కన పెట్టి కియారాకు ఆఫర్ ఇచ్చారు. క్షణం ఆలోచించకుండా లటుక్కున ఆ ఆఫర్ ను పట్టేసింది. ఓ బడా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. దీన్ని అదృష్టం కాక మరేమంటారు? ప్రస్తుతం కాజల్ కూడా అలాగే ఓ జాక్ పాట్ ఆఫర్ పట్టేసిందని అంటున్నారు.

సినిమా నుంచి త‌ప్పుకున్న త్రిష‌:
-మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిషను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సినిమా నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించింది. దీంతో ‘ఆచార్య’ టీమ్ కు మరో హీరోయిన్ ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు సెట్ కావడం చాలా కష్టం. ఆప్షన్లు పరిమితంగా ఉంటాయి. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నారట. గతంలో చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించింది కాబట్టి జోడీ బాగుంటుందనే ఉద్దేశం లో ఉన్నారట. కాజల్ ఎంపిక దాదాపుగా ఖరారయినట్టేనని అంటున్నారు.

– ఒకవేళ ఈ ఆఫర్ కాజల్ చేతికి వస్తే ఓ జాక్ పాట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమధ్య కాజల్ కు టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. ఈమధ్య ఛాన్సులు లేక అల్లరి నరేష్ లాంటి ఫామ్ లో లేని హీరో పక్కన కూడా నటించేందుకు రెడీ అవుతోందట. ఇలాంటి సమయంలో ‘ఆచార్య’ లో హీరోయిన్ ఆఫర్ దక్కడం అదృష్టమే. కొరటాల శివ సినిమాల సక్సెస్ రేట్ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సినిమా కూడా విజయం సాధిస్తే కాజల్ మరోసారి టాలీవుడ్ లో బిజీ కావడం ఖాయమ‌ని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతుండ‌టం గ‌మ‌నార్హం.