గౌతమ్ కిచ్లు ను ఈనెల 30న వివాహం చేసుకోనున్న నటి కాజల్

గౌతమ్ కిచ్లు ను ఈనెల 30న వివాహం చేసుకోనున్న నటి కాజల్

ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ నెల 30న వివాహం చేసుకోబోతున్నానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారి ఇళ్లలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా తన చేతివేళ్లను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె చేతి వేలికి డైమండ్‌ రింగ్‌ ఉంది.కారులో వెళ్తున్న సమయంలో ప్రత్యేకంగా చేతి వేలికున్న ఉంగరాన్నే చూపెడుతూ ఆమె ఈ పోస్ట్‌ చేయడం గమనార్హం. అది నిశ్చితార్థ ఉంగరమే అని స్పష్టమవుతోంది. ఇటీవల కిచ్లూ కూడా ఓ పోస్ట్‌ చేస్తూ వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నానని, తన వివాహ దుస్తులను ఏ డిజైనర్స్‌ సిద్ధం చేస్తున్నారనుకుంటున్నారని ఆయన అభిమానులను ప్రశ్నించారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కొత్త ఇంట్లో ఉండనున్నారు.