కాళేశ్వరం జలాలు సిద్ధిపేటను ముద్దాడాయి..

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమై అద్భుతంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు బుల్లెట్ స్పీడుతో దూసుకెళ్తూ ఫలితాలు ఇస్తోంది. అనంతగిరి నుంచి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేసారు.

ఒక్క ఇల్లు కూడా ముంపు బారిన పడకుండా 3TMCల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే అంశం. శుక్రవారం రంగనాయక్ సాగర్ నీళ్లు విడుదల చేసారు.

రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో నాలుగు పంపులున్నాయి. ఒక్కో పంపు సామర్ధ్యం134MW. ఒక్క పంప్ 24 గంటల్లో 0.25 TMC నీటిని లిఫ్ట్ చేస్తుంది. నాలుగు పంపులు మూడు రోజుల పాటు 24 గంటలు పని చేస్తే 3 TMCల నీటిని నింపగలవు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది.

రంగనాయక సాగర్ చందళ్ పూర్-ఇమామబాద్ మధ్యలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ నిర్మించారు.

CM KCR అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఓ గొప్ప నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి రాష్ట్రమంతా నమస్కరిస్తోంది. రైతుల త్యాగాలు మరువలేనివి, త్యాగాలు చేసిన రైతుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు, కుంటలు నిండుతాయని ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రులు హారీష్ రావు, KTR తెలిపారు.

గోదావరి జలాలతో పురిటి గడ్డ పుణీతమైంది

సిద్దిపేట జిల్లా రైతుల, ప్రజల సాగునీటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి ” సూర్య చంద్రులు ” ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట ప్రాంతం రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా మారింది. సమైక్యా రాష్ట్రంలో సిద్దిపేట ప్రాంత రైతులు సాగునీరు గురించి అప్పటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలే కనీసం ఆలోచించలేరు. సమైక్యా పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు బలయ్యారు.లెక్క లేనంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరెంట్ కష్టాలతో తల్లడిల్లారు. పంటలకు సాగునీరు లేక రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ..ఎన్ని బోర్లు వేసిన నిరందక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆదేశాలతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు విజయవంతంగా నిర్మించడం ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై మంత్రులు హరీష్ రావు మరియు KTR సంతోషకరమన్నారు.

దుబ్బాక ప్రాంతంలో ఎన్నో ఆకలి చావులు జరిగాయి. భూమిని నమ్ముకొని జీవించే రైతులకు పురుగు మందు పెరుగన్నం అయింది. భూములు త్యాగం చేసిన రైతులకు ప్రాజెక్టు సేకరణ చరిత్రలో ఒక్క కేసు లేకుండా ఎన్నడూ లేని విధంగా భూములిచ్చిన తక్షణమే నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. మరో వైపు ప్రాజెక్టుల నిర్మాణంలో ముంఫుకు గురైన రైతుల కుటుంబాలకు ఇంటికి పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెలించారు. వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద యుద్ధప్రాతిపదికన ఇండ్లను నిర్మించి ఇవ్వడం కూడా జరిగాయి. కుటుంబంలో పెళ్లైన యువతి యువకులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడం జరిగింది. నిర్మించిన ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకొనే హక్కును ఆయా గ్రామాల రైతుల కు అందజేయడం జరిగింది.

60ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది.. నేడు దశాబ్దాల కల సాకారమైంది..

రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతుల జీవితాల్లో గొప్ప వెలుగువస్తుంది. అభివృద్ధి బహుముఖంగా ఉంటుంది.. ఈ మహా జల కృతువు లో భాగస్వామీ అయినందుకు ” నా జన్మ చరితార్థం ” అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమై మనందరి కృషి ఫలించి ” ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యం తో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకవడం ఒక అరుదైన ఘట్టం. ఇది సీఎం కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వ పనితీరు కు ఒక గొప్ప నిదర్శనం”.