సముద్రాన్ని తలపిస్తోన్న కాళేశ్వరం జలాలు

సముద్రాన్ని తలపిస్తోన్న కాళేశ్వరం జలాలు

తెలంగాణలో కాళేశ్వరం జలాలు రహదారులకు ఇరువైపులా చూపరుల కళ్లకు కనువిందు చేస్తున్నాయి. బోయినపల్లి మండలం శాభాష్ పల్లి వద్ద శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయాన్ని గోదావరి నీళ్లతో నింపగా ఆ పరిసరాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. బ్యాక్ వాటర్ రహదారులకు ఇరువైపులా నిండి ఉండటంతో కిలో మీటర్ వంతెన ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సముద్రాన్ని తలపిస్తోన్న ఈ జలకలలు స్థానికుల మదిని మైమరపింపజేస్తున్నాయి.