గౌతమి స్థానంలో మీనాను సెట్ చేస్తున్న కమల్

గౌతమి స్థానంలో మీనాను సెట్ చేస్తున్న కమల్

జీతూ జోసెఫ్ మలయాళంలో తెరకెక్కించిన ‘దృశ్యం’ అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమిళ .. తెలుగు భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్ – మీనా ప్రధానమైన పాత్రలను పోషించారు. తెలుగులో వెంకటేశ్ – మీనా ఆ పాత్రలను చేశారు. తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురును కాపాడుకోవడం కోసం .. తన పరువు ప్రతిష్ఠలను రక్షించుకోవడం కోసం ఏం చేశాడనే కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తమిళంలో ఈ సినిమా రీమేక్ లో కమలహాసన్ – గౌతమి నటించారు. ఆ సమయంలో కమల్ – గౌతమి ఒక కప్పుకింద ఉండటం వలన ఆ సినిమాను కలిసి చేశారు. ఆ తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు మళ్లీ ‘దృశ్యం 2’ రీమేక్ లో చేయడానికి కమల్ రెడీ అవుతున్నారు. అయితే గతంలో గౌతమి చేసిన పాత్రకి గాను ఆయన మీనాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మీనాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది.