ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్

ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ వర్షన్ కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కంగన మరో కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది.అయితే, ఆ చిత్రం ఇందిరాగాంధీ బయోపిక్ కాదని… ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగన వెల్లడించింది. ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించనున్నాడు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని కంగన నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.