కరోనాలోనే Ex CM కుమారస్వామి తనయుని వివాహము.

 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు, మన దేశ మాజీ ప్రధాని దేవీ గౌడ మనవడు నిఖిల్ వివాహం కేతుగాన హళ్లి ఏరియా రాంనగర్ జిల్లా బెంగళూరు సమీపంలో జరిగింది.

గ్రీన్ సిటీ నుంచి మంగళూరు వెళ్లే హైవేలో రాంనగర్ జిల్లాలోని ఓ ఫామ్ హౌజులో ఈ వివాహ వేడుకలు జరిగాయి. స్థానిక పోలీసుల అనుమతి తీసుకుని ఈ వివాహాన్ని కరోనా మహామ్మారి నిబంధనలతో జరిపామని అంటున్నారు.

కేవలం కుమార స్వామి కుటుంభ సభ్యులు ఆయన తల్లిదండ్రులు, అక్క చెల్లెల్లు, అన్నదమ్ములు,అలాగే పెళ్లి కూతురు రేవతి తరపు కుటుంభ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ముందుగా కుదుర్చుకున్న వివాహం అవడంతో పోలీసులు అనుమతి నిరాకరించ లేకపోయారు. కరోనా లాక్ డౌన్2 నిబంధనలకు అనుగుణంగానే అనుమతి ఇచ్చామని పోలీసులు అంటున్నారు. కుమార స్వామి ఈ రాంనగర్ నియోజక వర్గానికే ప్రస్తుత MLA అవడం విశేషం.