కాశ్మీర్ to కన్యాకుమారి కాన్ఫరెన్స్…

దేశంలో కరోనా మహామ్మారిని అరికట్టడంపై శనివారం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, DGPలు హాజరయ్యారు. ముఖ్యంగా కేంద్రం ఇప్పటి వరకు అందిస్తోన్న సహాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, వైద్య సామగ్రి, అత్యవసర, నిత్యావసర వస్తువుల అందుబాటు అంశాలను చర్చించారు. అలాగే ఏప్రిల్ 27న ప్రధానమంత్రి మూడోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మే మూడు తర్వాత కరోనా లాక్ డౌన్ కొనసాగింపు అంశం, ఎదురవుతోన్న సవాళ్లపై చర్చలు జరుపనున్న సందర్భంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కేంద్ర సర్కారు రాష్ట్రాలు ఇష్టానుసరం నిర్ణయాలు తీసుకోవడం తగదని హెచ్చరించిన పరిస్థితుల్లో కేబినెట్ కార్యదర్శి ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.