కరో’నా’లో కత్రినా కైఫ్ కసు కొడుతోంది..ఫోటోలు మీ కోసం

బాలీవుడ్ భామల కాల్ షీట్స్ దొరకడం అంటేనే కష్టం, అందులో No1 హీరోయిన్ కోసమైతే అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. కానీ కరోనా వైరస్ కారణంగా బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ అండ్ శాండల్ వుడ్ అన్నీ చిత్ర పరిశ్రమలు సినిమాల చిత్రీకరణ నిలిపేసాయి. అందుకే బాలీవుడ్ హీరో హీరోయిన్లు ఇళ్లకే పరిమితం అవుతూ అందరికి కరోనా సోకకుండా అవగాహన కల్పించడం, ఇంట్లో ఎలా ఉంటే మంచిదో సమాజానికి తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ముందున్నారు. మొన్న ఈ మధ్యే జరిగిన జనతా కర్ఫ్యూ రోజు గిటారు వాహించారు అలాగే పళ్లెం పట్టుకుని సాయంత్రం 5గంటలకు హంగామాలో మునిగితేలారు. ఇప్పుడేమో కరోనా 21 రోజుల గృహమే కదా స్వర్గ సీమ హెచ్చరికల్లో ఇంట్లోనే గడుపుతూ సొంత పనులను చేసుకుంటున్నారు. కరోనాతో కత్రీనా కైఫ్ కసు కొడుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జాలీగా ఇంటిని శుభ్రం చేసుకుంటూ కసు కొట్టే చీపురుతోనే క్రికెట్ ఆటాడుతూ హంగామా చేశారు. కత్రినా కైఫ్ కసు కొడుతోన్న ఫోటోలు మీ కోసం.