కరోనాపై కేసీఆర్ అత్యవసర సమావేశం

 

కరోనాపై కేసీఆర్ అత్యవసర సమావేశం

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడిపై ముఖ్యమంత్రి
కేసీఆర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్19 మహమ్మారి ప్రబలకుండా మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన
వైద్య సదుపాయాలు, చర్యలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణలో అమలు చేసేందుకు నడుం బిగించనున్నారు. గురువారం నుంచి హైదరాబాద్ తో పాటు రాష్ట్ర మంతటా
హై అలర్ట్ ప్రకటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై గురువారం ప్రగతి భవన్ లో నిర్వహించిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు.

కాసేపట్లో పూర్తి వివరాలు.