కరోనా కట్టడిపై కేసీఆర్ కార్యచరణ…

తెలంగాణలో కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నాటికి 59 కేసులు నమోదయ్యాయి. 20వేల మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోమ్ క్వారాంటైన్
ఏరియాలో ఉంటున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు పెట్టకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లమన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ప్రపంచంలో కరోనాకు
మందు లేదు, కరోనా అరికట్టేందుకు స్వీయనియంత్రణ ఒక్కటే మార్గం. అత్యాధునికమైన అమెరికా లాంటి దేశం కూడా
కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే ప్రజలు సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లా భారతదేశంలో పరిస్థితులు ఎదురైతే 20కోట్ల మంది కరోనా బారిన పడే భయంకర పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజలకు దండ పెడుతున్నా దయచేసి స్వీయనియంత్రణ పాటించాలి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో
వైద్యులు, నర్సులు, అత్యవసర ఏర్పాట్లు, భోజనం వసతి, రవాణా అంశాలపై చర్చించాము. గచ్చిబౌలిలో ICU కోసం 1400 పడకలు అందుబాటులోకి తెస్తున్నాం. వెంటిలేటర్స్ కూడా 500, అవసరమైతే 11500 మంది
ఐసోలేషన్ లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసాము. 60వేల మందికి కూడా ఏకకాలంలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. విరామంలోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరిని గుర్తిస్తున్నాం,14వేల అదనపు డాక్టర్ల బృదం సిద్ధమవుతోంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావద్దు, దయచేసి ప్రభుత్వము, పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించాలి. నిత్యావసర వస్తువుల పంపిణీపై కూడా దృష్టి పెడుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోన్న ఇతర రాష్ట్రాల వారికి కూడా విజ్ఞప్తి మీకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోంది మీరు ఇబ్బంది పడవద్దు ప్రభుత్వంను ఇబ్బంది పెట్టవద్దు. 50లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి, పంట చేతుల్లోకి వచ్చే సమయం పంట చేతికి వస్తేనే మనకు ఆహారం ఉంటుంది. SRSP నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల కింద నీళ్లు ఏప్రిల్ 10వ తేదీ వరకు సరఫరా చేస్తాము. రైతులు ఒక్క ఎకరం పంట కూడా ఎండ కుండ పంట పండించుకోవాలి. పగలు రాత్రులు కష్టపడి నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉంచుతున్నాము.

లాక్ డౌన్ ఏప్రిల్ 15 వరకు…
రాష్ట్రంలో ప్రజలందరికీ కూరగాయలకు గుంపులుగా వెళ్లరాదు. దయచేసి ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షణ సమయంలో గుంపులు గంపులుగా వెళ్లారాదు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు లేకుండా జాగ్రత్త పడుతున్నాము. రాష్ట్రంలో కలెక్టర్లు అందరికి ఆదేశించామని ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న కార్పోరేషన్లలో పని చేస్తోన్న కూలీలు, పేదలు,బిక్షగాళ్ళు,అనాధలు, అందరికి అండగా ఉండాలని సూచించాము. నగరంలో హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వసతి మూసివేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పశుగ్రాసం, పాలు, నిత్యావసర వాహనాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు రోడ్లపై అనుమతి ఇస్తున్నాము.
చికెన్ తింటే వైరస్ వస్తుంది అని కొంత మంది దుర్మార్గులు ప్రచారం చేశారు కానీ చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు బత్తాయి, సంత్రా అలాగే
‘C’ విటమిన్ ఉండే పదార్థాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే పండ్ల వాహనాలకు ప్రత్యేక పాసులు అందజేసి హైదరాబాద్ నగరానికి తీసుకు వస్తున్నాము.
ప్రజలందరూ కోడి గుడ్లు బాగా తినాలి. 50లక్షల ఎకరాల్లో పంట సాగు కొనసాగుతోంది, పంట కోత జరగాలి, పంట అమ్ముకోవాలి అందుకే జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది.
ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి కర్ఫ్యూ చూశామా?
ప్రపంచమే తలకిందులు అవుతోంది.

రైతులకు విజ్ఞప్తి
పంట కొనుగోలు-అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఐకెపి కేంద్రాలు పఏర్పాటు చేస్తాము, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారు. మీరు అంత ఆగమాగం అవ్వొద్దని ముఖ్యమంత్రి అన్నారు. పంట కొనేందుకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోంది. మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అలాగే చెక్కుల రూపంలో డబ్బులు ఇస్తాం మీరు వచ్చేవారు బ్యాంకు ఖాతాలు ముందుగానే తీసుకుని రావాలని విజ్ఞప్తి.
రైతుల డబ్బులు మీ ఖాతాలో పడతాయి. మీ ధాన్యం గోదాంలలో పెడుతాం సరిపోకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. పంట పండిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పిస్తాము, కొనుగొలు చేస్తామన్నారు.
ప్రైవేట్ వ్యాపారులు కూడా కనీస మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేయాలి. గ్రామాల్లో, ఊర్లలో వేసిన కంచెలను వెంటనే తొలగించాలి. ఎందుకంటే మీ ఊరు పంటలు కొనాలి అంటే లారీలు రావాలి ఇంకా ఇతర రవాణా సరుకులు కూడా రావాలి. అందుకే ప్రజలందరూ ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలి. ఆయురారోగ్యాలతో ఉండేలా చర్యల్లో భాగంగా ఇంటికే పరిమితం కావాలని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడారు.