కేంద్రం విధానాలపై CM KCR అసహనం.

కేంద్రం త‌ప్పుడు విధానాలు అవ‌లంబిస్తోంది. దేశ ఆర్ధిక ప‌రిస్థితి క‌రోనా క‌న్నా ముందు చాలా దారుణంగా ఉంది. పులిమీద పుట్ట‌లా క‌రోనా దెబ్బ ప‌డింది. ఆర్థిక ప‌రిస్థితి చిన్నాభిన్న‌మైంది. తెలంగాణ‌కు ప్ర‌తి నెల రావాల్సిన ఆదాయం 15వేల కోట్లు. కానీ 10% కూడా రాలేదు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఫించ‌నుదార‌లుకు వేత‌నాలుగా మూడు వేల కోట్లు ఇవ్వాలి. పీఎం మోదీకి ఈ విష‌యాన్ని స్యయంగా చెప్పాను. డ‌బ్బులు కేంద్రం ఇవ్వ‌లేదు అందుకే దానికి మార్గం చూపించాను. హెలికాప్ట‌ర్ మ‌నీ కాకుంటే ఏదో ఒక మ‌ని ఇవ్వ‌మ‌ని చెప్పాను. కేంద్రం నిర్ణయాలు ఇర‌కాటంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఫ్లైట్ టికెట్ చార్జీని కేంద్రం వ‌సూలు చేయ‌డం దారుణం. చాలా బాధ‌క‌ర‌విష‌యం ఏమిటంటే ఎఫ్ఆర్‌బిఎంను పెంచాల‌ని పీఎం మోదీని అడిగాం. అప్పులు ఉన్న స‌మ‌యంలో రుణాల‌ను రీషెడ్యూల్ చేస్తారు. రాష్ట్రాలు చెల్లించాల్సిన రుణాల‌ను డిఫ‌ర్‌మెంట్ ఇవ్వాల‌ని అడిగాం. కేంద్రంపై వ‌చ్చే భారం ఏమిటో అర్ధం కావ‌డంలేదు. కేంద్రంపై మా నిర‌స‌న వ్య‌క్తం చేస్తాం.

కేంద్రం తీసుకువ‌చ్చే విద్యుత్ స‌వ‌ర‌ణ‌ బిల్లును పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకిస్తాం. రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించే బిల్లు ఇది. డిస్ట్రిబ్యూష‌న్‌ను ప్రేవేటుకు ఇచ్చే ప్ర‌య‌త్నం ఇది. కొత్త విద్యుత్ బిల్లు ప్ర‌కారం రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వ‌లేం. విద్యుత్ మీట‌ర్లు పెట్టాల్సి వ‌స్తుంది. రాష్ట్రంలో రాజ‌కీయ స‌మావేశాలు, మ‌త‌ప‌ర‌మైన స‌మావేశాల‌కు అనుమ‌తి లేదు. కేంద్రం కూడా ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.