బాలీవుడ్ బాటలో కేజీఎఫ్ స్టార్

కన్నడ లేటెస్ట్ సెన్సేషన్ కేజీఎఫ్ స్టార్ యశ్ బాలీవుడ్ తెరంగ్రేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలిస్తుంది. కన్నడనాట కేజీఎఫ్ తో తిరుగులేని మాస్ హీరో, పాన్ ఇండియా హీరోగా అవతరించిన యశ్ ఇప్పుడు బాలీవుడ్లో తన సత్తా చాటాలని భావిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహాన్ యశ్ ని బాలీవుడ్ కి పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

కేజీఎఫ్ తో టోటల్ ఇండియా ని తనవైపు చూసేలా చేసిన యశ్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా వుండబోతుందోనని అభిమానులు ఆశ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యశ్ కేజీఎఫ్2 చిత్రీకరణ ఉన్నాడు. అక్టోబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తేవాలని భావించినప్పటికీ లాక్ డౌన్ దెబ్బేయడంతో నిర్మాతలు కొత్త తేదీలను వెతికేపనిలోపడ్డారు.