నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం జాగ్రత్త, ఫోటోలతో పూర్తి సమాచారం

కాజిపేట రైల్వే స్టేషన్ అలర్ట్

కాజీపేటలో రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 30 నిమిషాల స్టేషన్‌లో ఆగిపోయింది. బెంగళూరు నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ వెళ్తోన్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్లో ఇద్దరు కరోనా అనుమానితులు ప్రయాణం చేయడంతో రైలును హఠాత్తుగా నిలిపివేశారు. B3లోని ఇద్దరు ప్రయాణికులను ఏప్రిల్ 5వరకు ఎక్కడికి వెళ్లోద్దని డాక్టర్లు హెచ్చరించినప్పటికి ఆ మాటలు పెడచెవిన పెడుతూ ఢిల్లీ
వెళ్లేందుకు సాహసించారు.

భారతదేశంలో కరోనా కేసులు 258

వికారాబాద్ లోని డాక్టర్లు ఈ ఇరువురికి సలహాలు సూచనలు కూడా చేసారు అలాగే చేతికి మార్క్ (స్టాంప్) కూడా వేయడం జరిగింది. కానీ రాజధాని రైల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఐతే తోటి ప్రయాణీకులు చేతులకు వేసిన మార్క్ సహాయంతో ఇద్దరు కరోనా అనుమానితులుగా ఉన్నారని గుర్తుపట్టి కాజీపేట్ రైల్వే స్టేషన్ లో వారిద్దరిని రైలు నుంచి దిగేలా చర్యలు తీసుకున్నారు.

కేంద్రం కరోనా వాట్సాప్

కాజీ పేటలో రైల్వే పోలీసులు ఈ ఇరువుని గుర్తించి అంబులెన్సులో హైదరాబాద్ గాంధీ హాస్పిటలుకు తరలించారు. B3 భోగిని పూర్తిగా శానిటైజషన్ ద్వారా శుభ్రపరచిన తర్వాత రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

కరోనా కట్టడికి గృహమే స్వర్గసీమ