కిషన్ రెడ్డి ముఖ్య సందేశం

గుజరాత్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ సందర్భంగా రవాణా సదుపాయంలేక చాలా ఇబ్బంది పడ్డ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గుజరాత్ ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి నిన్న అర్ధరాత్రి తరలించారు.

వారికి మార్గ మధ్యలో ఆహార పానీయాలకు మార్గమధ్య రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేసేవిధంగా చర్యలు తీసుకున్నట్లు కిషన్ రెడ్డి వీడియో సందేశం ద్వారా తెలిపారు.