కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ ఫాలోవర్లు

కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ ఫాలోవర్లు

క్రికెట్ ఆటలో అనేక రికార్డులు తిరగరాసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను పొందిన మొట్టమొదటి భారతీయుడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ వైడ్ గా ఈ ఘనత సాధించిన క్రీడా ప్రముఖుల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో కోహ్లీ కంటే ముందు సాకర్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో (265 మిలియన్లు), లయొనెలె మెస్సీ (186 మిలియన్లు), నేమార్ (147 మిలియన్లు) వరుసగా టాప్-3లో నిలిచారు.కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు చేస్తే భారీ మొత్తంలో పారితోషికం ముడుతుందన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆదాయం పొందే క్రీడాకారుల టాప్-10 జాబితాలో ఉన్న ఒకే ఒక క్రికెటర్ విరాట్ కోహ్లీ. అంతేకాదు, దేశంలో బ్రాండ్ వాల్యూ పరంగానూ ఇతర రంగాల సెలబ్రిటీలను వెనక్కినెట్టిన ఈ క్రికెట్ వీరుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, సోషల్ మీడియాలో కోహ్లీ ప్రభంజనంపై ఐసీసీ కూడా స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్లను పొందిన మొట్టమొదటి క్రికెటర్ అని కొనియాడింది.