కనికరంలేని కరోనాను ఖతం చేయాల్సిందే…CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ కోవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్‌19 లాంటి మహామ్మారి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాలను మెరుగుపర్చు కోవడం చాలా అవసరమని, గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం అభిప్రాయబడ్డారు. మెడికల్ ల్యాబులు లేని జిల్లాల్లో లతక్షణమే అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో చర్చించిన అంశాలు యుద్ధప్రాతిపాదికన అమలయ్యేలా చూడాలని CM అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు వెలుగు చూసినందున ఓ ఉన్నతాధికారిని ఆ జిల్లాకు పంపించాలని, ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఏపీలో ఏప్రిల్ 24న ఒక్కరోజే 6928 పరీక్షలు చేసారని, ఇప్పటివరకూ 61,266 పరీక్షలు పూర్తయ్యాయని,
ప్రతి మిలియన్‌ జనాభాకు 1147 పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

టెలి మెడిసిన్‌ వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన నడపాలని, ఫోన్ చేసిన వ్యక్తులకు మందులు ఇవ్వడమే కాకుండా ప్రజలకు రక్షణ అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. టెలి మెడిసిన్‌ నిర్వహణకు 14410కు మరింత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జనతా బజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తుందన్న వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలు, కోవిడ్‌-19 నివారణా చర్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్న మరో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం అళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.