కోవిడ్-19 సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

కోవిడ్-19 సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

ట్విట్టర్ లో ప్రధాని నరేంద్రమోడీ కోవిడ్-19 వైరస్ పై సంసిద్ధతకు సంబంధించి విస్తృతమైన సమీక్ష జరిగింది.భారతదేశానికి వచ్చే ప్రజలను పరీక్షించడం నుండి, తక్షణ వైద్య సహాయం అందించడం వరకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి.

కరోనా వచ్చేసింది.. జాగ్రత్తగా ఉందాం.

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి *కరోనా వైరస్* (కొవిడ్ 19) ఇండియాలోకి ప్రవేశించింది.

వ్యాధిగ్రస్తుల నుండి ఇతరులకు సులువుగా వ్యాపించే ఈ వైరస్ పట్ల *అప్రమత్తత అవసరం*

వ్యాధిగ్రస్తులు *తుమ్మినపుడు, దగ్గినపుడు వెలువడే స్రావాలు* ఆరోగ్యవంతుల ముఖంపై (ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కు) *పడినప్పుడు వైరస్ సోకుతుంది*

దగ్గు, తీవ్రమైన జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి/కరోనా *వ్యాధి లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉండండి*

*జనసమర్ధమున్న ప్రాంతాలకు వెళ్లకపోవడం ఉత్తమం*
ఎందుకంటే కరోనా వైరస్ బాధితులెవరో వారికే తెలీకపోవచ్చు.. మనకెలా తెలుస్తుంది.

*ముఖానికి మాస్క్ ధరించిన వాళ్లందరినీ కరోనా వ్యాధిగ్రస్తులుగా అనుమానించాల్సిన పనిలేదు*
వ్యాధి బారినపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వారు ముఖానికి మాస్క్ ధరించివుండొచ్చు.

వ్యాధిగ్రస్తులు పట్టుకున్న తలుపు గడలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెట్ల వెంబడి గోడలు, సపోర్ట్ రాడ్లు తదితర వస్తువులపై వైరస్ ఉండొచ్చు. ఆయా వస్తువులను అనుకోకుండా ముట్టుకున్నా మనకు వైరస్ సోకే ప్రమాదముంది. వైరస్ ఉన్న వస్తువులను తాకిన చేతులతో కళ్లు నులుపుకోవడం, ముఖాన్ని రుద్దుకోవడం, ఇతరుల ముఖాన్ని తాకడం వల్ల కరోనా వ్యాపిస్తుంది.

ఎందుకంటే వస్తువులపై పడిన *కరోనా వైరస్ దాదాపు 48 గంటల వరకు జీవించివుంటుంది*

కాబట్టి…
*చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి*
మోచేతుల వరకూ..
అరచేతి వెనుక భాగంలో..
గోళ్ల సందుల్లో కూడా…

కొద్దిరోజులు *కరచాలనం ఆపేద్దాం..*
మర్యాద కోసమే అయితే ఎంచక్కా నమస్కరించవచ్చు కదా…

మాస్క్ ధరించేవాళ్లు ప్రతిరోజూ మాస్క్ మార్చితే మంచిది. సాధారణ మాస్కులతో పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రత్యేక *మాస్క్ తో పాటు కళ్ళద్దాలు ధరించడం ఉత్తమం*

ఏదేమైనా..
*అనారోగ్యం బారినపడగానే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి*

ఇదంతా జస్ట్.. జాగ్రత్త కోసమేనండీ..!
*ఆందోళన వద్దు.. అలాగని నిర్లక్ష్యం వద్దు*

In supercession of all earlier advisories wrt COVID19. All Regular/eVisas/ issued to nationals of Italy, Iran, South Korea & Japan issued on/before March 3, 2020, & who have not yet entered India, stand suspended with immediate effect