1st మొబైల్ వైరాలజీ ల్యాబ్ KTR ఏమన్నారు??

హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వైరాలజీ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కె.టి రామారావు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.

అన్ లైన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కెటియార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు కోసం కృషి చేసిన డి ఆర్ డి ఓ మరియు ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. దేశంలో ఇలాంటి అత్యుత్తమ ప్రమాణాలు ఉన్న ల్యాబ్ ఇదొక్కటే అని, సుమారు ఆరు నెలల సమయం పట్టే టువంటి స్లాబ్ ని కేవలం రెండు వారాల్లో సిద్ధం చేసేందుకు ప్రయత్నం చేసిన డిఆర్డిఓ మరియు అందుకు సహకరించిన ఇతర కంపెనీల భాగస్వామ్యాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ ప్రభుత్వం సైతం గట్టి ప్రణాళికలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలను పాటిస్తూ కోసం వైరస్ కట్టడి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతుందని తెలియజేశారు, ప్రజలకి ఒకవైపు విశ్వాసాన్ని నెలకొల్పుతే కరోనా కట్టడి త్రీముఖ వ్యూహం చేపట్టామన్నారు. లాక్ డౌన్ ఏర్పాటు చేసి సామాజిక దూరం ద్వారా కంటెయిన్ మెంట్ చేస్తున్నామన్నారు. ఎవరికైనా రోగం వస్తే వారిని ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలోని పేద ప్రజలకు, ఇక్కడ పనిచేస్తున్న వలస కార్మికులందరికీ అవసరమైన రైస్ ని, 1500 రూపాయాలను అందిస్తున్నామన్నారు. దీంతోపాటు వైద్య సౌకర్యాల కల్పనకు కూడా చేపట్టామాని, కోవిడ్ కోసం ఎనిమిది ఆస్పత్రులను ప్రత్యేకంగా ఉపయోగించడంతో పాటు 1500 పడకల ఆసుపత్రిని రికార్డ్ సమయంలో ఏర్పాటు చేశామన్నారు.

ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజలందరి భాగస్వామ్యంతోనే వైరస్ ని ఎదుర్కోగలమని కేటీఆర్ అన్నారు. పల్లె ప్రజలు ఇందుకోసం పట్టణ ప్రజల కన్నా బాగా సహకరిస్తున్నారన్న అభిప్రాయం ఉందన్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన ల్యాబ్ ద్వారా కేవలం కరోనా వైరస్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైనటువంటి ఇతర అంటు వ్యాధులను త్వరితగతిన గుర్తించేందుకు వీలు కలుగుతుందని, ఇలాంటి ఏర్పాటు చేసేందుకు సహకరించిన అందరికీ మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.