డాక్టర్ల సలహా మేరకు యశోద ఆసుపత్రిలో KTR చేరిక

డాక్టర్ల సలహా మేరకు యశోద ఆసుపత్రిలో KTR చేరిక

తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి కేటీఆర్ కు గత నెల 23న కరోనా పాజిటివ్ అని వెల్లడైన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. అయితే, గత రెండ్రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతుండడంతో ఆయనను గత రాత్రి హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు.ఆక్సిజన్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.