ఢిల్లీలో పరిస్థితులపై KTR పర్యవేక్షణ

ఢిల్లీలో జర్నలిస్టుల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమాచారం తీసుకున్నారు. కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కోసం ₹12 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తక్షణ సాయం కింద పాజిటివ్ వచ్చిన ముగ్గిరు జర్నలిస్టులకు ₹ 75 వేల నగదు విడుదల చేసారు. ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ పర్యవేక్షిస్తున్నారు.