కర్నూలులో కరోనా మృత్యుంజయులు

కరోనా బారిన పడి మెరుగైన ప్రభుత్వ వైద్యం సదుపాయాలతో కరోనా మహమ్మారిని కర్నూలు జిల్లాలో ముగ్గురు జయించారు.

 

కర్నూలు జిల్లాలోని నంద్యాల శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి నుండి ఆరోగ్యంగా ఈ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లిన కర్నూలు జిల్లా వాసుల్లో 48, 58 మరియు 62 వయసుల వ్యక్తులున్నారు.

ఈ నెల2న జిల్లా కోవిడ్ ఆస్పత్రి శాంతిరామ్ ఐసోలేషన్ వార్డులలో ఆ ముగ్గురుని ప్రభుత్వ సాయంతో వైద్యులు,
పారా మెడికల్ సిబ్బంది కంటికి రెప్పలా కాపడటంతో కోలుకున్నారు. కరోనా టెస్టులు 2 సార్లు చేయించగా నెగటివ్ రావడంతో ఈ రోజు రాత్రి శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి డాక్టర్లు డిశ్చార్ చేసారు.

కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన ఆ ముగ్గురిని శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి వద్ద అభినందనలు తెలిపి ..ప్రత్యేక అంబులెన్స్ వాహనాల్లో వారి వారి ఇంటికి పంపిన వాళ్లలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి, డిఎస్పీ చిదానంద రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.

కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం ప్రభుత్వం తరఫున భరించి తమను ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వానికి, డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ అందరికీ ఈ ముగ్గురు కరోనా మృత్యుంజయులు ధన్యవాదాలు తెలిపారు.