దీపారాధన ప్రాధాన్యత ఉప రాష్ట్రపతి వెంకయ్య మాటల్లో

కరోనా వైరస్ చేస్తున్న సవాళ్లను వెరవకుండా మనమంతా కలిసికట్టుగా కోవిడ్19 మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిద్దాం. ఇవాళ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతోపాటు 130 కోట్ల మంది భారతీయులు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం.

దీప ప్రజ్వలన అజ్ఞానం నుంచి జ్ఞానమార్గంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి వెళ్లేందుకు మనకు మార్గదర్శనం చేస్తుంది. మన ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్, పారిశుద్ధ్య సిబ్బందికి మన సంఘీభావాన్ని తెలుపుదాం. విశ్వమానవాళికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ దీపాలు వెలిగిద్దాం.ప్రభుత్వాలు, అధికారులు సూచించినట్లుగా వ్యక్తిగత శుభ్రతను, సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం.