కరోనాపై “మొక్క”వోని ధైర్యంతో విజయం సాదిద్దాం – ఎంపీ సంతోష్ పిలుపు

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మానవుని నైజం. అది భూమిపై కానీ అంతరిక్షంలో కానీ లేక పాతాళంలో కానీ అంతేందుకు సముద్రంలో కానీ ఎక్కడైతేనేమి సమస్త విశ్వంలో ఒక్కటే మనకు విజయాన్ని ఇస్తుంది అదే మనలోన్న దృఢ సంకల్పం.

సంకల్ప బలం ఉండాలే కానీ మనిషి ఎడారిలో కూడా బతికేస్తాడు, హిమాలయాల్లో ఐస్ క్రీం అమ్మేస్తాడు, పరిస్థితులు ఎక్కడైన, ఏమైనా సరే, ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా, ఉక్కు సంకల్పం ఉంటే అనుకున్నది సాధించడంలో తిరుగుండదు.మనిషికి ఉన్నటువంటి గొప్ప వరం ఈ ఆశ, నమ్మకం, సంకల్ప బలం.మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదనేది మన అందరికి తెలిసిన విషయమే అందుకే ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహామ్మారిని పారద్రోలాలంటే “సంకల్ప బలం”తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మార్గదర్శకాలు, భౌతిక దూరం పాటించాలి. ఇంటికే పరిమితమై కోవిడ్19 మహామ్మారిపై పోరాడి విజయం సాధించాలని రాజ్యసభ MP సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా రైల్వే ట్రాకుపై ఓ మొక్క “సంకల్ప బలం”తో మొలకెత్తిన ఫోటోను ప్రజలందరికి మనస్సులోని భావాలను ముందుంచారు.