అబద్ధాలు నీటి మీద రాతలు..భగవంతుడున్నాడు

శ్రీకాళహస్తి ఈశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రంలో నోరు పారేసుకుంటే ప్రజలు వెర్రోళ్ళేం కాదు. అటు దేవుడు ఇటు ప్రజలు అందరూ నిజాలు గమనిస్తూనే ఉంటారు.

ప్రతిపక్షాలు నోటికి వచ్చిన లెక్కలు చెబుతూ, ఇష్టం వచ్చినట్టు రాసినంత మాత్రాన పాలు నీళ్లు కాదని గుర్తుంచుకోవాలి. శ్రీకాళహస్తిలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసులకి స్థానిక ఎమ్మెల్యేకు అస్సలు సంబంధం లేదని ప్రజలే స్పష్టంగా చెబుతున్నారు. కరోనా ఏమైనా వాళ్లకు వీళ్లకు చెబుతూ వస్తుందా ఏమైనా ఎక్కడ? ఎప్పుడు? ఎవరికి సోకుతుందో బ్రహ్మ దేవుడికే తెలియాలి. ఎమ్మెల్యే మధు పైన మీకు కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష ఎక్కువై ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తున్నారు. మూడో కన్ను ఆ భగవంతుడు ఆధర్మంపై తెరిస్తే ఎవరైనా సరే భస్మము అవ్వాల్సిందే జాగ్రత్త..

మీ మాటలు నమ్మే పరిస్థితిలో శ్రీకాళహస్తి ప్రజలు లేరు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా మా MLA మదన్న ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చారని చేస్తోన్న కృషిని చూసి స్థానిక ప్రజలు అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి నిజం నిర్భయంగా వీధుల్లో ప్రజలతో స్నేహం చేస్తుంది అబద్ధం నీటి మీద రాతల్లా తడుచుకుపోతుంది.