లైఫ్ లైన్ ఉడాన్ అత్యవసర సేవలు

కోవిడ్-19పై యుద్ధం చేస్తున్న భారత్ చర్యలకు మద్దతుగా పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆపరేట్ చేస్తున్న లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు వైద్య రంగానికి చెందిన అత్యవసర వస్తువులు పరికరాలను మారు మూల ప్రాంతాలకు సైతం రవాణా చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్ కి చెందిన లైఫ్ లైన్ ఉడాన్ 316 విమానాలు ఈ లాక్ డౌన్ లో విస్తృతంగా తమ సేవలను అందించాయి. వీటిలో 196 విమానాలు ఒక్క ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ నడిపినవే ఉన్నాయి. ఈ విమానాలన్నీ ఇప్పటి వరకు 541.33 టన్నుల సరకు రవాణా చేసాయి. ఇవి మొత్తం 3,14,965 కిలోమీటర్ల గగన తలాన ప్రయాణం చేశాయి.

పవన్ హంస్ తో పాటు వివిధ కంపెనీల హెలికాప్టర్ సేవలను జమ్మూ కశ్మీర్, లడాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగించి ముఖ్యమైన వైద్య వస్తువులతో పాటు కొందరు రోగులను కూడా తరలించారు. ఈ ఏప్రిల్ 20 వరకు పవన్ హంస్ హెలికాఫ్టర్లు 6,537 కిలోమీటర్లు ప్రయాణం చేసి 1.90 టన్నుల సరుకును రవాణా చేశాయి. దేశీయ లైఫ్ లైన్ ఉడాన్ కార్గోలో కోవిడ్-19 సంబంధిత కారకాలు, ఎంజైములు, వైద్య పరికరాలు, పరీక్షా వస్తు సామగ్రి, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈలు), మాస్క్, చేతి గ్లోవ్స్, హెచ్ఎల్ఎల్, ఐసిఎంఆర్ కి సంబంధించిన ఇతర పదార్థాలు ఉన్నాయి; రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు కోరిన మీదట పోస్టల్ ప్యాకెట్లు కూడా రవాణా చేశారు. దేశీయ లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు హబ్-స్పోక్ మోడల్‌లో పనిచేస్తాయి. ఈశాన్య ప్రాంతం, ద్వీప ప్రాంతాలు, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎయిర్ ఇండియా, ఐఎఎఫ్ ప్రధానంగా జమ్మూ కశ్మీర్, లడాఖ్, ఈశాన్య ఇతర ద్వీప కల్ప ప్రాంతాలకు విస్తృతంగా సేవలు అందించాయి. సరుకులో ఎక్కువ భాగం తేలికపాటి బరువు, ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించే మాస్కులు, చేతి గ్లోవ్స్, ఇతర వినియోగ వస్తువులు కలిగి ఉంటుంది, ఇవి విమానంలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.. ప్రయాణీకుల సీటింగ్ ఏరియా, ఓవర్ హెడ్ క్యాబిన్లలో సరుకును నిల్వ చేయడానికి ప్రత్యేక అనుమతి తీసుకుని తగిన జాగ్రత్తలతో రవాణా చేసారు. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలకు సంబంధించిన ప్రజా సమాచారం ఎప్పటికప్పుడు పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. https://esahaj.gov.in/lifeline_udan/public_info

లైఫ్లైన్ ఉడాన్ విమానాలకు రాష్ట్ర ప్రభుత్వాల గొప్ప సహకారం అందించాయి. దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో వ్యాపార ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ మార్చి 24 నుండి 20 ఏప్రిల్ వరకు 447 కార్గో విమానాలను 6,64,675 కిలోమీటర్ల దూరం నడిపి 3516 టన్నుల సరుకును రవాణా చేసింది. వీటిలో 143 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 152 దేశీయ కార్గో విమానాలను 1,49,333 కిలోమీటర్ల దూరం, 2407 టన్నుల సరుకును మార్చి 25 నుండి ఏప్రిల్ 20 వరకు నడిపింది. ఇండిగో 3-20 ఏప్రిల్ 2020 లో 33 కార్గో విమానాలను నడిపింది 37,160 కిలోమీటర్ల దూరాన్ని, 66 టన్నుల సరుకును తీసుకువెళుతుంది. ప్రభుత్వానికి ఉచితంగా తీసుకునే వైద్య సామాగ్రి కూడా ఇందులో ఉంది.

అంతర్జాతీయంగా సరకు రవాణా గగన మార్గాన్ని, తూర్పు ఆసియాకి రూపొందించారు. ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాలు, కోవిడ్-19 సహాయ వస్తువుల రవాణా వీటిలో జరుగుతున్నాయి.