కరోనాతో కల్లు కోసం క్యూ..

ఓ వైపు లాక్ డౌన్ కారణంగా లిక్కర్ అందుబాటులో లేకపోవడంతో కల్లుకు డిమాండ్ పెరిగింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌ల్లు అమ్మ‌కాలు తాటి కల్లు దివ్యౌషధమా? ఇందులో సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు వుండటంతో ఊబకాయం, మధుమేహం నియంత్రణకు మంచిది. రోగనిరోధకశక్తి అధికమని తేలింది. పూర్వీకులు చెప్పినట్లు తాటిచెట్టు కల్పవృక్షమే. తాటికల్లు సుమధురమైన దివ్య ఔషధమే. స్వర్గలోకంలో అమృత భాండ. స్వర్గలోకంలో అమృత భాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమ్మీద పడి తాటి వృక్షమై మొలిచినదట. ఇందులో వాస్తవమెంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కల్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనలో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షణగా నిలుస్తుంది. శరీరానికి జవసత్వాలను ఇస్తుంది. బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు పూర్వకాలం నుంచే పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ప్రత్యేక సంధర్భాల్లో దీన్ని సేవిస్తూ ఉంటారు.

సుర‌పానం:
సురాపానంగా వ్యవహరించే తాటికల్లులో అనేక ఔషధ గుణాలున్నాయి. దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది. తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది. అయ‌తే ఇంత ఎందుకు చెబుతున్నామంటే ప్ర‌స్తుతం మందు దొర‌క్క‌పోవ‌డంతో తాటిక‌ల్లుకు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది.

క‌రోనా ఎఫెక్ట్‌:
కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… 22 కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే నిత్యవసర వస్తువుల తప్ప అన్నింటిని క్లోజ్ చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని బయటకు వచ్చినప్పటికీ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాయి. దీనితో మందుబాబులకి కష్టాలు మొదలయ్యాయి.. సరైనా సమయానికి మందు దొరకకపోవడం, తెచ్చుకున్న స్టాక్ కూడా అయిపోవడంతో మందుబాబులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే కొందరు మాత్రం బ్లాక్‌లో మద్యం అమ్ముతుండగా పట్టుబట్టారు. అంతేకాకుండా సిలిండర్లలో కూడా మద్యం బాటిళ్లు పెట్టి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు.. ఈ నేపథ్యంలో గ్రామాల్లో దొరికే కల్లుతో మందుబాబులు తృప్తి చెందుతున్నారు. దీనితో కల్లుకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది.. అయితే ఇక్కడ కూడా మందుబాబులు సామాజిక దూరంగా పాటిస్తున్నారు. రెండు, మూడు మీటర్ల దూరంలో సర్కిల్స్ ఏర్పాటు చేసుకొని అందులో నిలబడి కల్లు తాగుతున్నారు. అంతేకాకుండా గీత కార్మికులు కూడా వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఓ వ్యక్తి పైపు ద్వారా కల్లు పోస్తూ కనిపిస్తున్నా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కల్లు కూడా దొరకక కొన్ని చోట్లల్లో మద్యం ప్రియులు విలవిల్లాడుతున్నారట.. కేరళ, హైదరాబాద్ లలో మద్యం ల‌భించ‌క‌ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.