ఏపీలో మద్యం ధరలు మరోసారి పెంపు

ఏపీలో మద్యపానాన్ని నిరుత్సాహపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. మరో యాభైశాతం ధరల పెంపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్న మద్యం దుకాణాల ఎదుట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం ధరలను భారీగా ప్రభుత్వంపెంచింది.

ఇప్పుడున్న ధరలపై మరో యాభై శాతం ధరలు పెంచనున్న ప్రభుత్వం, మొత్తంగా 75శాతం మద్యం ధరలు పెంచేసినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు ఇవ్వాళ్టినుంచే యాభైశాతం అమలు అవుతున్నాయి. ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గింపునకు నిర్ణయాలు తీసుకుంటోంది.