ఏపీలో నేటితో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా గడువు ముగిసింది. Next ఏంటీ??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటితో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పక్రియ సమయం ముగిసింది. కరోనా కారణంగా 15.03.20 నాటి నుంచి ఆరు వారాలు మాజీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వాయిదా వేసారు.

దేశ వ్యాప్తంగా కరోనాతో లాక్ డౌన్ 3.0 నేపథ్యంలో యధాస్థితిని కొనసాగిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది. కరోనా కష్టకాలం దుర్భర పరిస్థితులు వెళ్లిన తర్వాత సానుకూలంగా ఎన్నికల ప్రక్రియ ప్రకటన చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కమిషన్‌ ఇవాళ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల జారీ చేసే వరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. పంచాయితీ కార్యాలయాలకు రంగుల తొలగింపు అంశంపై హైకోర్టు ఆదేశాలను నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ ప్రస్తావించింది.