ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మార్చి 21న, మున్సిపల్ మార్చి 23న ఎన్నికలు జరుగనున్నాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీస ఎన్నికలు ఈనెల 9 వ తేదీ నుంచి 11 తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. మార్చి 12వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీస ఎన్నికలు
మార్చి 21న నిర్వహణ 24న కౌంటింగ్ జరుగనుంది.

ఏపీలో ఈనెల 9న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
విడుదల కానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. మార్చి 16న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 23న పోలింగ్ 27న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి జరుగనుంది.

అలాగే ఏపీలో ఈనెల 15న GP1 అండ్ 17న GP2 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. GP1 మార్చి 27న పోలింగ్, GP2 మార్చి 29న పోలింగ్ అలాగే GP1
27న ఓట్ల లెక్కింపు, ఫలితాలు, GP2 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి.