లాక్ డౌన్ 5.0 కంటైన్మెంట్ జోన్లలో జీవితం

దశలవారీగా కంటోన్మెంట్ పరిధిలోకి రాకుండా ఉన్న వాటిలో తెరిచి ఉండే ప్రదేశాలు కేంద్ర ఆరోగ్య శాఖ యొక్క సాధారణం నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించబడేవి. వివరాలు

ఒకటో దశ
జూన్ ఎనిమిదో తారీఖు నుండి కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతి ఇవ్వబడేవి.
1. ప్రార్ధనా స్థలాలు
2. హోటళ్లు రెస్టారెంట్లు మరియు ఇతర సేవలను అందించే ప్రదేశాలు
3. షాపింగ్ మాల్స్

రెండో దశ
స్కూళ్లు, కాలేజీలు, మరియు ఇతర విద్య ,ట్రైనింగ్, మరియు కోచింగ్ సంస్థల రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు పరిపాలనకు సంబంధించి సంప్రదింపుల మేరకు పేరెంట్స్ తో ఆ యొక్క సంస్థలతో జరిపిన సంప్రదింపుల తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జూలై నెలలో ప్రారంభించవచ్చు.

మూడో దశ
పరిస్థితుల యొక్క పరిశీలన తరువాత ఏ రోజు నుంచి మిగతా వాటిని పునః ప్రారంభించాలి అనే విషయాన్ని గురించి తీసుకోబడుతుంది.
1. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల అనుమతి
2. మెట్రో రైలు
3. సినిమా హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఎంటర్ టైన్మెంట్ పార్కులు, బార్లు, అసెంబ్లీ హాల్స్, ఇండస్ట్రీస్, థియేటర్లు మరియు అలాంటి ఇతర ప్రదేశాలు.
4. సామాజిక, రాజకీయ, ఆటలు సంబంధించినటువంటి వినోద కార్యక్రమాలు విద్యాసంబంధ సంస్కృతి సంబంధ మత సంబంధ సమావేశాలు.

2. జాతీయ కోవిడ్-19 నియంత్రణ మార్గదర్శకాలు
దేశ వ్యాప్తంగా కోవీడ్ నియంత్రణ కోసం రూపొందించినటువంటి నిబంధనలు వర్తిస్తాయి.

3. రాత్రి సమయంలో కర్ఫ్యూ
దేశవ్యాప్తంగా రాత్రి సమయంలో పౌరుల యొక్క కదలికలపై కఠిన నిబంధనలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఖచ్చితంగా అమలు అవుతాయి. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన వాటిని స్థానిక అధికార యంత్రాంగం యొక్క అనుమతుల మేరకు సెక్షన్ 144 అమలుకు లోబడి అనుమతించబడతాయి.

4. లాక్ డౌన్ కేవలం కంటోన్మెంట్ జోన్ మాత్రమే పరిమితం అవుతుంది.
1. జూన్ 30, 2020 వరకు కంటోన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అలాగే కొనసాగుతుంది.
2. కేంద్రం మార్గదర్శకాలు నిబంధనలకు లోబడి జిల్లా యంత్రాంగం నిర్ణయం మేరకు కంటోన్మెంట్ జోన్ యొక్క నిర్ణయం లాక్ డౌన్ అమలు చేయబడుతుంది.
3. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే అనుమతించబడతాయి. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని వ్యక్తులు బయటికి వెళ్లడం లోపలికి రావడం పైన కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయి. కేవలం నిత్యావసర వస్తువుల సరఫరా సరుకులు రవాణా అనుమతించబడతాయి.

ఈ జోన్ పరిధిలో ప్రతి ఇంటి పైన నిఘా మరియు వైద్య సంబంధమైన దర్యాప్తు కొనసాగుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ యొక్క సూచనలకు అనుగుణంగా కేవలం అత్యవసర వైద్య సంబంధమైన అవసరం కోసం అనుమతులు ఇవ్వబడతాయి.

4. రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రభుత్వాలు కంటెన్మెంట్ జోన్లకు అవతల ఎక్కడైతే కొత్త కేసులు వస్తాయని భావించే బఫర్ జోన్స్ ను, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తించి అవసరమైన ఆంక్షలను విధించడానికి జిల్లా యంత్రాంగం అధికారం కలిగి ఉంటుంది.