రాష్ట్రాలు కఠినంగా కట్టడి చేయాల్సిందే: కేంద్రం

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. వలసకూలీలు రవాణాపై అసంతృప్తి వ్యక్తపరుస్తూ రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని హెచ్చరించింది. సరకు రవాణాకు మాత్రమే వాహనాలను అనుమతి ఇవ్వాలి. ప్రజలు ప్రయాణాలు చేస్తే మాత్రం స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులవుతారంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాల్సిందేనని తెలిపింది. దేశవ్యాప్తంగా 1053 పాజిటివ్‌ కేసులు 27 మరణాలు నమోదయ్యాయి.