లాక్ డౌన్ ట్రాఫిక్ కలర్ జోన్స్ ప్రణాళిక

దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు దాదాపు ఖాయమైంది. ప్రజలందరూ కరోనా మహామ్మారి కట్టడికి కాస్తంత దూరంగానే ఉంటూ కలిసికట్టుగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. కారణం యూరప్, అమెరికా దేశాల్లో కరోనా విజృంభన, మృత్యు మరణ మృదంగం, విలయ తాండవ అనుభవాలు, భయాలను అనుభవాలుగా తీసుకుని కరోనా వైరస్ యుద్ధంలో పోరాటానికి సైనికుల్లా పౌరులు కంకణం కట్టుకున్నారు.

అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగింపుకు చేయాల్సిందేనని నిర్ణయించారు. అంతే కాకుండా 130కోట్ల జనాభా కలిగిన మన దేశంలో కరోనా అత్యవసర వైద్య సేవలు అంధించేందుకు సులువుగా జోన్లు నిర్ధారణ చేస్తున్నారు. అందుకు ట్రాఫిక్ సిగ్నల్ లోన్న రంగుల ఆధారంగా జాగ్రత్తలు తీసుకునేందుకు 1. RED 2. ORANGE 3. GREEN మూడు జోన్లను ప్రకటించే అవకాశాలున్నాయి. అందులో

1. RED ZONE (అత్యధిక వైరస్ ప్రభావ ప్రాంతాలు)
కరోనా అత్యవసర వైద్య సేవలు 24/7 ఉండేలా చూడాలని నిర్ణయించారని సమాచారం. కరోనా సోకిన వ్యాధులకు యుద్ధ ప్రాతిపదికన వైద్యం అలాగే కరోనా అత్యధికంగా ప్రబలిందని అనుమానిత ప్రాంతాలను ఈ జాబితాలో చేర్చడంతో కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది.

2. ORANGE ZONE (మధ్యస్తంగా ఉండే ప్రాంతాలు)
కోవిడ్-19 మహామ్మారి మధ్యస్తంగా విజృంభించే అవకాశాలు ఉన్నాయని అనుమానించే ప్రదేశాల్లో క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేయడం. ప్రజలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.

3. GREEN ZONE (తీవ్రత తక్కువ ప్రాంతాలు)
ఈ ప్రాంతాల్లో కరోనా సోకకుండా/వ్యాపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఈ జోనులో లాక్ డౌన్ నిబంధనలకు సడలింపు ఉండే అవకాశాలున్నాయి. వ్యవసాయం, పరిశ్రమల నిబంధనలు మినహాయిస్తారని తెలుస్తోంది.

దేశమంతటా ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ప్రణాళికలు, ప్రయాణాలకు నిబంధనలు, కరోనా కట్టడికి హాట్ స్పాట్స్ నిర్ధారణ, లాక్ డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకునే వ్యవస్థపై కేంద్ర రాష్ట్రాల్ వ్యవస్థలు దృష్టి సారిస్తున్నాయి.