కరోనా, లాక్ డౌన్ పేర్ల నామకరణం

ప్రపంచం మొత్తం ఇప్పుడు మహమ్మారి కరోనా వైరస్ పారద్రోలేందుకు భగవంతున్ని కోరుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసి అందరూ మళ్లీ సాధారణ జీవితాన్ని పొందాలని ప్రార్థిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో పుట్టిన ఒక బాబుకు అతని తల్లిదండ్రులు లాక్‌డౌన్‌ అని నామకరణం చేశారు. ఇదేవిషయంపై బాబు తండ్రి పవన్‌ మాట్లాడుతూ మా అబ్బాయి లాక్‌డౌన్‌ కాలంలో పుట్టాడు అందుకో ఈ నామకరణం చేసామని తెలిపారు. కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సమయంలో లాక్‌డౌన్‌ విధించి ఎంతో మంది ప్రాణాలు కాపాడినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కొనియాడారు.

దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించిన సమయంలో జన్మించిన అడ శిశువుకు ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌ జిల్లాలో ఉంటున్న ఆమె మేనమామ కరోనా అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మేనమామ నితీష్‌ త్రిపాఠి మాట్లాడుతూ కరోనా వైరస్‌ అందరిని ఒక్కటి చేసి పోరాడేలా చేస్తోంది. కరోనా వైరస్‌ ప్రమాదకారి అనడంలో సందేహం లేదు, దాని కారణంగా చాలా మంది చనిపోయారు కూడా. కానీ కరోనా వైరస్‌ మనకి చాలా మంచి అలవాట్లను నేర్పించిందన్నారు.