లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు తప్పదు

దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది. అలాగే మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై రాష్ట్రాలు భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లతో కేసులు నమోదు చేయవచ్చని కేంద్రం తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు 2020 మార్చి 24న అమలులోకి వచ్చాయని ఈ నిబంధనలు ఉల్లంఘింస్తే 2005 డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టంలోని 51వ సెక్షన్‌ నుంచి 60 సెక్షన్లు, ఐపీసీలోని సెక్షన్‌ 188 ఉల్లంఘనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్ర
హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆ లేఖలో ప్రకటించారు.

కేంద్రం నిబంధనలు పూర్తి వివరాలు