లాక్ డౌనులో ONLINE ఎడ్యుకేషన్..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉన్నటువంటి విద్యార్థుల చదువు ప్రక్రియ కోసం ఐఐటీ-జేఈఈ ఫోరం అలాగే ప్రముఖ ఐఐటీ, నీట్ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ, నీట్ మోడల్, మోక్ టెస్ట్స్ అన్నింటిని ఆన్ లైన్ విధానంలో విద్యార్థులకు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. ఔత్సహిక విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ద్వారా ఆన్ లైన్ లింక్ వివరాలను వాట్సాప్ ద్వారా రేపటి నుండి అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మొబైల్ 98490 16661 నెంబర్ ‘ Online Test ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయవలిసిందిగా కోరారు.