‘ఆచార్య’ తర్వాత సెట్స్ కి లూసిఫర్ రీమేక్

‘ఆచార్య’ తర్వాత సెట్స్ కి లూసిఫర్ రీమేక్

సినిమా టైటిల్ అనేది కథకు సరిపోవాలి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలగాలి. అలా ఆకర్షణీయంగా వుండే టైటిల్ దొరికినప్పుడు సినిమాకి అదెంతో ప్లస్ అవుతుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే మరీ పవర్ ఫుల్ గా ఉండాలి. ఆయా హీరోల ఇమేజ్ కు సరిపోయేలా.. అభిమానులకు నచ్చేలా నిర్ణయించాలి. ఇక చిరంజీవి సినిమాల టైటిల్స్ అయితే చెప్పేక్కర్లేదు. కాస్త మాస్ టచ్ తో కూడా ఉంటాయి.ఈ క్రమంలో తాజాగా ఆయన నటించే చిత్రానికి అలాగే ‘రారాజు’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేయనున్నారు. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘రారాజు’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. మరి, చివరికి దీనినే ఫైనల్ చేస్తారా? అన్నది త్వరలో తెలుస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చే ఈ చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభిస్తారు. చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా దర్శకుడు మోహన్ రాజా మాతృకకు చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి బాగా నచ్చాయట.