మేడ్ ఇన్ ఇండియా కరోనా టెస్ట్ కిట్.

మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో కరోనా టెస్ట్ కిట్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ క‌రోనా వైర‌స్‌ టెస్టింగ్ కిట్‌ను త‌యారు చేసింది మన దేశానికి చెందిన
ఓ మ‌హిళ‌. కరోనా మెడికల్ టెస్టింగ్ కిట్ త‌యారు చేయ‌డానికి కేవ‌లం ఆరు వారాల స‌మ‌యం ప‌ట్టింది. అదే విదేశాల్లో అయితే టెస్టింగ్ కిట్‌ను త‌యారు చేయ‌డానికి మూడు నాలుగు నెల‌లు ప‌డుతుంది. మ‌హారాష్ట్ర పూణెకు వైరాల‌జిస్టు మినాల్ ద‌ఖావే భోశాల నిండు గ‌ర్భిణీ. ఆమె ఓవైపు ప్రసవ వేదనతో నొప్పులు భ‌రిస్తూ కరోనా వర్కింగ్ టెస్ట్ కిట్‌ను త‌యారు చేసి ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించారు. ఇక్క‌డో విష‌యం ఏమిటంటే.. క‌రోనా వైర‌స్ టెస్టింగ్ కిట్ త‌యారు చేసిన అనంత‌రం కొన్ని గంటలకే ఆమెకు పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ కిట్ త‌యారీ ద్వారా దేశంలోని క‌రోనా వైర‌స్ బాధితుల‌కు త‌క్కువ స‌మ‌యంలో రోగ నిర్ధార‌ణ చేయ‌డానికి వెసులుబాటు క‌లుగుతుంది.

దేశంలో తొలిసారిగా పూణెలోని మైలా డిస్కవరీ (Mylab Discovery) కంపెనీకి టెస్టింగ్ కిట్స్ తయారీ, అమ్మకం అనుమతులు లభించాయి. మొదటి 150 కిట్‌లను పూణె, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు పంపింది. రెండో విడ‌త‌గా కిట్లను మార్చి 30న పంప‌నున్నారు. ప్రస్తుతం ఒక్కో కరోనా టెస్టింగ్ కిట్‌నీ 1200₹కి అమ్ముతున్నారు. అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే భారత్ 4500₹ చెల్లించాల్సి వస్తోంది. ఈ కిట్ ద్వారా రెండున్నర గంటల్లో క‌రోనా వైర‌స్ రోగ నిర్ధార‌ణ తేలిపోనుంది. అదే విదేశీ కిట్ల ద్వారా రోగ నిర్ధార‌ణ‌కు 6 నుంచి 7 గంటలు స‌మ‌యం పడుతోంది.
ప్ర‌సూతి సెలవుపై గ‌త నెల‌లో ఇంటికి వచ్చిన భోశాలీ తానే కరోనా వైర‌స్‌ టెస్ట్ కిట్ చెయ్యాలని భీష్మించుకుని అదో చాలెంజ్‌గా తీసుకున్నారు. మొత్తం 10 మంది టీమ్‌తో కలిసి విజయవంతంగా పని పూర్తి చేసారు. మార్చి 18న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి టెస్ట్ కోసం కిట్‌ను పంపారు. ఆ తర్వాత ఇండియన్ FDA, డ్రగ్స్ కంట్రోల్ అథార్టీ CDSCOలను వాణిజ్యపరంగా తయారుచేసేందుకు అనుమతి కోరగా వెంటనే అనుమతి లభించింది. ఈ కిట్ ద్వారా ఒకే శాంపిల్‌ని 10 సార్లు టెస్ట్ చేసినా ఫలితాలు ఒకేలా వస్తాయి. అందువల్ల ఈ కిట్‌కి అనుమతి లభించింది. వారానికి లక్ష కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారుచేయగ‌ల‌మ‌ని తెలిపిన‌ కంపెనీ నిర్వాహకులు అవసరమైతే 2 లక్షలు కూడా ఉత్పత్తి చేస్తామని వెల్ల‌డించారు.

ప్ర‌సూతి సెలవుపై గ‌త నెల‌లో ఇంటికి వచ్చిన భోశాలీ… తానే కరోనా వైర‌స్‌ టెస్ట్ కిట్ చెయ్యాలని అనుకున్నారు. అదో చాలెంజ్‌గా తీసుకున్నారు. మొత్తం 10 మంది టీమ్‌తో కలిసి… విజయవంతంగా పని పూర్తి చేసి మార్చి 18న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి టెస్ట్ కిట్‌ను పంపారు. ఆ తర్వాత ఇండియన్ FDA, డ్రగ్స్ కంట్రోల్ అథార్టీ CDSCOలను వాణిజ్యపరంగా తయారుచేసేందుకు అనుమతి కోరారు. వెంటనే అనుమతి లభించింది. ఈ కిట్ ద్వారా ఒకే శాంపిల్‌ని 10 సార్లు టెస్ట్ చేసినా ఫలితాలు ఒకేలా వస్తాయి. అందువల్ల ఈ కిట్‌కి అనుమతి లభించింది.వారానికి లక్ష కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారుచేయగ‌ల‌మ‌ని తెలిపిన‌ కంపెనీ నిర్వాహకులు అవసరమైతే 2 లక్షలు కూడా ఉత్పత్తి కోసం ఛాలెంజ్ తీసుకుని పని చేస్తామని వెల్ల‌డించారు.

.