మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన రాజకీయ సంక్షోభం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాటకాలకు తాత్కాలికంగా తెరపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేశారు. మధ్యాహ్నం గవర్నర్తో
ఆయన భేటీలో తన పదవికి రాజీనామా చేస్తోన్న లేఖను
సమర్పించారు. సుప్రీంకోర్టు బలపరీక్ష ఇవాళ్టి సాయంత్రం ఐదు గంటలలోపు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బలపరీక్ష వరకు వెళ్లకుండానే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.