రోజా త్వరగా కోలుకోవాలని మహామృత్యుంజయ హోమం

రోజా త్వరగా కోలుకోవాలని మహామృత్యుంజయ హోమం

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు. గత ఏడాదే ఈ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా… కరోనా తీవ్రత కారణంగా ఆమె వాటిని వాయిదా వేసుకున్నారు.అయితే జనరల్ చెకప్ కోసం ఈనెల 24న ఆసుపత్రికి వెళ్లగా… వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పూర్తైన తర్వాత ఆపరేషన్ చేయాలని వైద్యులను ఆమె కోరినా… వారు ఒప్పుకోలేదు. వెంటనే చేయాలంటూ రెండు శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఏడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ వివరాలను రోజా భర్త సెల్వమణి వెల్లడించారు.మరోవైపు, రోజా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఆలయాల్లో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.