దేవరకొండకు మద్దతుగా నిలిచిన సూపర్ స్టార్ మహేష్.

అవును మీరు చదివింది నిజమే.సూపర్ స్టార్ మహేష్ బాబేంటి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ కి మద్దతు తెలపడం ఏంటి అనే అనుమానం కలుగుతుందా.అయితే ఈ వార్త మీకోసమే.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న మిడిల్ క్లాస్ కుటుంబాలను ఆదుకునేందుకు విజయ్ ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలిసిందే.వచ్చిన డబ్బుతో ఇప్పటికే 2000 మందికి సహాయం కూడా అందించాడు.

అంత బానే ఉంది కధ ఇంకా దేవరకొండ ఎందుకు ఫైర్ అయ్యాడనే కధ అనుమానం.అదే విజయ్ దేవరకొండ చేసిన ఈ పనినే విమర్శిస్తూ కొన్ని వెబ్సైట్లు ఇష్టానుసారంగా కథనాలు రాయడం పట్ల దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ సైట్లు నిజాలు రాయకపోయిన పర్లేదు కానీ వారికి నచ్చినట్లు పచ్చి అబద్దాలను మాత్రం రాయడం సమంజసం కాదంటూ కొన్ని వెబ్సైట్లపై నిప్పులు చెరిగారు.ఉన్నంతలో సహాయం చేస్తున్న తనలాంటి వారిపై నిందలు వేస్తూ పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నందుకు సిగ్గుపడలని హితవు పలికారు.వెబ్సైట్ల నిర్వకంపై తన యూ ట్యూబ్ ఛానెల్ లో సుదీర్ఘ వివరణ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ వివరణ పట్ల టాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ మహేష్ బాసటగా నిలిచారు.తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది బ్రదర్ అంటూ మహేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.చూద్దాం వెబ్సైట్లపై టాలీవుడ్ టాప్ హీరోల యుద్ధం వారిలో మార్పును తీసుకొస్తుందో లేదో చూడాలి.