కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో మహేశ్

కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో మహేశ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తీసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన కుమారుడు గౌతమ్‌, కూతురు సితారతో కలిసి ఆయన భోజనం చేస్తుండగా ఓ ఫొటో తీసుకున్నాడు. ఈ ఫొటోలను మహేశ్ బాబుతో పాటు, ఆయన భార్య నమ్రత కూడా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రావెల్ డైరీస్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది.డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని వారు తీసుకున్న ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన భార్యాపిల్లలతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.